రూ. 20 కోట్ల సెట్ లో షూటింగ్.. 60 రోజులు చిరంజీవి అక్కడే
on Feb 1, 2020
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం కొన్ని రోజులు నైట్ షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేటలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇంతకుముందు అక్కడే 'సైరా నరసింహారెడ్డి' కోసం సెట్ వేశారు. కోకాపేట లోనే సెట్ చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే.... అది చిరంజీవి కుటుంబానికి చెందిన సొంత స్థలం. అక్కడ సెట్స్ వేయడం వల్ల స్టూడియోలకు రెంట్ కట్టే భారం తగ్గుతుంది. 'సైరా...' సెట్స్ తీసేసి తాజాగా కొరటాల శివ సినిమా కోసం కొత్త సెట్స్ వేశారు.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సెట్స్ వేశారట. హీరో ఇంటితోపాటు హీరోయిన్ ఇంటి సెట్... ఇలా మొత్తం మీద ఓ చిన్నపాటి కాలనీని క్రియేట్ చేశారట. మెజారిటీ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారని తెలిసింది. సుమారు 60 రోజుల పాటు కోకాపేట లోని సెట్ లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.