English | Telugu

రోబో 2.0 టీజ‌ర్ లీకేజీ వెనుక ర‌హ‌స్యం ఇదేనా??

on Mar 5, 2018

 

లీకేజీల గొడ‌వ కొన‌సాగుతూనే ఉంది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించే సినిమాల‌పైనే ఈ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ప‌డ‌డం నిజంగా శోచ‌నీయ‌మైన అంశ‌మే. బాహుబ‌లికీ ఈ లికేజీ గోల త‌ప్ప‌లేదు. ఇప్పుడు రోబో 2.0కీ అదే స‌మ‌స్య ఎదురైంది. ఈ సినిమా గురించి రెండేళ్లుగా ర‌జ‌నీ అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో వ‌దిలిన స్టిల్స్ త‌ప్ప‌... `రోబో 2.0` నుంచి ఎలాంటి స‌ర్‌ప్రైజ్ లేదు.  ఇప్పుడు స‌డ‌న్ గా ట్రైల‌ర్ లీకైపోయింది. రోబో 2 ట్రైల‌ర్ లీకేజీ ఇప్పుడు త‌మిళ‌నాట ఓ సంచ‌ల‌నంగా మారింది. 90 సెక‌న్ల ఈ ట్రైల‌ర్‌... ఇప్పుడు దేశం మొత్తం ట్రెండ్ సృష్టిస్తోంది.

ఏప్రిల్ 27న రోబో 2ని విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం వ్యూహం. అయితే.. కాలా వ‌ల్ల రోబో ఆల‌స్యం అవుతోంది. రోబో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇంకా పూర్త‌వ‌లేద‌ని, ఈ యేడాది చివ‌రికి గానీ.. రోబో రాద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈలోగా రోబో 2 టీజ‌ర్ ని విడుద‌ల చేసే ప‌నిలో చిత్ర‌బృందం నిమ‌గ్న‌మైంది. అందులో భాగంగా ఈ ట్రైల‌ర్ క‌ట్ చేశారు. కానీ.. అదే ఇప్పుడు లీకైపోయింది.  ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రోబో 2 ప్ర‌చార చిత్రాన్ని ఎవ‌రైనా లీక్ చేశారా, లేదంటే చిత్ర‌బృంద‌మే దీన్ని కావాల‌ని బ‌య‌ట‌కు వ‌దిలిందా?  అనే సందేహాలున్నాయి. ఎందుకంటే ఇటీవ‌ల ర‌జ‌నీ సినిమా `కాలా` టీజ‌ర్ బయ‌ట‌కు వ‌చ్చింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ టీజ‌ర్ చూసి అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. వాళ్ల అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేక‌పోయింది కాలా టీజ‌ర్‌. అంతే కాదు.. `క‌బాలి` ఛాయ‌లు కాలా టీజ‌ర్ లో క‌నిపించ‌డంతో ఈ సినిమాపై నెగిటీవ్ ఇంప్రెష‌న్స్ మొద‌ల‌య్యాయి.  దాంతో పాటు `రోబో 2`ని కూడా జ‌నం మ‌ర్చిపోయే స్థితికి చేరుకున్నారు. ఆసినిమా ఇప్ప‌ట్లో రాదులే...అని అభిమానులు డిసైడ్ అయిపోయారు. వాళ్ల‌లో ఉత్సాహాన్ని నింప‌డానికి... ఇలా ట్రైల‌ర్‌ని లీకేజీ పేరుతో బ‌య‌ట‌కు వ‌దిలిందా? అనే అనుమానాలు నెల‌కున్నాయి. 

నిజానికి చిత్ర‌బృందం కావాల‌ని లీక్ చేసేంత అవ‌స‌రం లేదు. అఫీషియ‌ల్‌గానే విడుద‌ల చేయొచ్చు. కానీ... రోబో 2 ఎప్పుడు విడుద‌ల అవుతుందో తెలీదు. ఈలోగా టీజ‌రో, ట్రైల‌రో వ‌దిలేస్తే.. విడుద‌ల‌కు ముందు హంగామా చేయ‌డానికి ఏం ఉండ‌దు.పైగా జ‌నం `రోబో 2` గురించి మాట్లాడుకోవ‌డానికి ఈ లీకేజీ ఓ ర‌కంగా దోహ‌దం చేస్తుంది. అందుకే.. చిత్ర‌బృందం కావాల‌ని లీక్ చేసి ఉండొచ్చ‌ని మ‌రో బ‌ల‌మైన వాద‌న వినిపిస్తోంది.


Cinema GalleriesLatest News


Video-Gossips