`2.0` ఫస్ట్ డే కలెక్షన్స్!!
on Nov 30, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ వండ్రఫుల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం `2.0` చిత్రం ఈ గురువారం విడుదలై విజయ పథంలో దూసుకెళ్తోంది. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలై అంతటా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 80 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. హిందీ వెర్షన్ 23 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలోనే తొలి రోజు ఐదు కోట్ల షేర్ రాబట్టుకుందట. అలాగే ఏపీలో ఏడున్నర కోట్లు, రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి ఓవరాల్గా 12.53 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మరోవైపు కర్ణాటకలో రూ.8.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అలాగే చైన్నైలో 2.37 కోట్లు షేర్ కొల్లగొట్టి సర్కార్ చిత్రాన్ని క్రాస్ చేసిందట. ఓవర్సీస్ , యుఎస్, బ్రిటన్ లలో మూడు మిలియన్ల డాలర్లు వసూలు చేసిందట. ఇలా ఈ చిత్రం మొదటి రోజు 80 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే బ్లాక్ అండ్ వైట్, కలర్, యానిమేటెడ్, త్రీడీ ఇలా నాలుగు రకాల చిత్రాలలో నటించిన ఏకైన హీరో మా తలైవా అంటూ రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.