సూర్య డొనేషన్.. 1300 ప్రొడ్యూసర్లకు బెనిఫిట్!
on Sep 20, 2020
ఇటీవల తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్పీఏ) సభ్యులకు జీవిత బీమా కోరుతూ కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నాయకత్వంలో ఒక దావా కోర్టులో నమోదయ్యింది. ఇప్పుడు టీఎఫ్పీఏ సభ్యులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించడానికి ఏర్పాట్లు చెయ్యాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, తన సినిమా 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హద్దురా) ఓటీటీలో విడుదలవుతున్న సందర్భంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు సూర్య రూ. 30 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ అమౌంట్‌ను న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. టీఎఫ్పీఏ ట్రస్ట్‌లో తగినన్ని నిధులు లేని ఈ కష్ట కాలంలో సూర్య ఇచ్చిన విరాళం ద్వారా 1300 మంది సభ్యులు బీమా ప్రీమియం నుంచి లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సూర్యను న్యాయమూర్తి అభినందించారు.
Also Read