చెన్నైలో ప్రభాస్ ప్రాపర్టీ కొంటున్నాడా?
on Dec 21, 2019
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెన్నైలో ప్రాపర్టీ కొంటున్నాడా? బీచ్ పక్కన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాడా? అంటే తమిళ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు అవుననే అంటున్నాయి. చెన్నైలో బీచ్ ప్రాపర్టీ ఒకటి కొనడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ప్రభాస్ ఈ ప్రాపర్టీ కొనాలని అనుకోవడానికి కారణం ప్రజెంట్ తమిళంలో టాప్ హీరోయిన్ అట.
చెన్నై బీచ్ ముందున్న ఓ ప్రాపర్టీ అమ్మకానికి ఉందని తెలిసిన హీరోయిన్... ప్రభాస్ కు వాట్సాప్ లో సేల్ డీటెయిల్స్ ఫార్వార్డ్ చేసిందట. హీరోకి నచ్చడంతో కొనాలని సీరియస్ గా ఆలోచిస్తున్నాడట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడానికి ముందు ప్రభాస్ చెన్నైలో ఉండేవాడు. అతడికి తమిళనాడులో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయట. ఇప్పుడు కొనాలనుకుంటున్న ప్రాపర్టీని మాత్రం ఇన్వెస్ట్ మెంట్ కోణంలో చూస్తున్నాడట. కొన్ని రోజుల తర్వాత దాని విలువ పెరుగుతుందని భావిస్తున్నాడట. సినిమాల విషయానికి వస్తే... 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'జాన్' షూటింగ్ జనవరిలో ప్రారంభించాలని అనుకున్నారట.
Also Read