ENGLISH | TELUGU  

'గద్దలకొండ గణేష్' బాక్సాఫీస్: బయ్యర్స్ సేఫ్!?

on Sep 23, 2019

 

వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేసిన 'గద్దలకొండ గణేష్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ దిశగా అడుగులు వేస్తోంది. ఫస్ట్ వీకెండ్‌లో పెట్టుబడిపై 67 శాతం రాబట్టడంతో, రానున్న రోజుల్లో సేఫ్ అవడమే కాకుండా ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెడతామన్న ఆశ బయ్యర్స్‌లో కనిపిస్తోంది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఏరియాల్లో 'గద్దలకొండ గణేష్' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 19 కోట్ల 30 లక్షల రూపాయలు. మూడు రోజుల్లో ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ సుమారు 13 కోట్ల రూపాయలు. అంటే 67 శాతం రికవరీ వచ్చేసింది. 

నైజాంలో బయ్యర్ పెట్టిన డబ్బు 7 కోట్ల 20 లక్షల రూపాయలు కాగా, 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూలయ్యింది. ఈ ఏరియాలో 62.5 శాతం రికవరీ అయ్యిందన్న మాట. రాయలసీమలో 3 కోట్ల 30 లక్షల మేరకు ప్రి బిజినెస్ జరిగితే, 2 కోట్లు రికవర్ అయ్యాయి. పెట్టుబడిలో 60 శాతం పైగా వచ్చేసినట్లే. ఇక ఆంధ్రా ఏరియాలో 'గద్దలకొండ గణేష్' ప్రి బిజినెస్ వాల్యూ 8 కోట్ల 80 లక్షల రూపాయలు. మూడు రోజుల్లోనే అందులో 6 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చేశాయి. అంటే 73 శాతం రికవరీ అయ్యింది. దీన్ని బట్టి నైజాం, రాయలసీమ ఏరియాలతో పోలిస్తే, ఆంధ్రాలో 'గద్దలకొండ గణేష్'పై ప్రేక్షకులు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా 'బి, సి' ఏరియాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది.

'ఎఫ్ 2' మూవీని పక్కనబెడితే, వరుణ్ తేజ్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో 'గద్దలకొండ గణేష్' టాప్ ప్లేస్‌లో నిలబడింది. రెండో రోజైన శనివారం కంటే, మూడో రోజైన ఆదివారం కాస్త ఎక్కువ షేర్ రావడం గమనార్హం. రెండో రోజు 3 కోట్ల 50 లక్షల షేర్ సాధించిన 'గద్దలకొండ గణేష్', మూడో రోజు 3 కోట్ల 90 లక్షల షేర్ కలెక్ట్ చేశాడు.

సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గిపోతాయి కాబట్టి, సెకండ్ వీక్‌లో ఈ మూవీ బ్రేకీవెన్ సాధించవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 2న 'సైరా.. నరసింహారెడ్డి' వచ్చేంతవరకూ మార్కెట్‌లో 'గద్దలకొండ గణేష్'కు పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. కాకపోతే ఆంధ్రా ఏరియాని మినహాయిస్తే నైజాం, రాయలసీమ ఏరియాల్లో బయ్యర్లకు పెద్దగా లాభాలు రాకపోవచ్చని అంచనా.

కాగా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఆశించిన రీతిలో వసూళ్లను సాధించలేకపోతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడుపోగా, ప్రీమియర్స్‌తో కలుపుకొని ఫస్ట్ వీకెంట్‌లో వసూలయ్యింది కేవలం 1 కోటి 30 లక్షల రూపాయలు. అంటే రికవరీ శాతం 48 మాత్రమే. వీకెండ్‌లోనే ఇలా ఉంటే, వీక్ డేస్‌లో ఓవర్సీస్ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనుకోవడం అత్యాశే! కాబట్టి ఆ ప్రాంతంలో 'గద్దలకొండ గణేష్' బ్రేకీవెన్ సాధించడం కష్టమని తెలుస్తోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.