శర్వా 'శ్రీకారం'లో నాని పోరి
on Sep 23, 2019
‘నానిస్ గ్యాంగ్‌లీడర్’తో తెలుగు తెరకు పరిచయమైన బెంగళూరు భామ ప్రియాంకా అరుల్ మోహన్. సినిమా ఏ రేంజ్ హిట్ అనేది పక్కన పెడితే... అమ్మాయి హిట్ అయింది. ఫలితంతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో ప్రియాంకకు మంచి పేరు వచ్చింది. క్యూట్‌గా, పక్కింటి అమ్మాయిలా, పద్దతిగా ఉందన్నారు ప్రేక్షకులు. తెలుగులో తొలి సినిమా విడుదలకు ముందే మరో సినిమా ఛాన్స్ అందుకుందీ అమ్మాయి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’లో హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. తొలి సినిమాకు తెలుగు నేర్చుకోవడమే కాదు, డబ్బింగ్ కూడా చెప్పుకోవడంతో షూటింగులో వేరొకరు ప్రాంప్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో ఈమెకు అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. కొత్త జోడీల కోసం దర్శకులు, నిర్మాతలు వేట సాగిస్తున్నారు. ఈమెకు ఇది ప్లస్ అయ్యేలా ఉంది.