ఇదే 'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్!
on Sep 20, 2019
క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ వచ్చేసింది. టైటిల్‌ని బట్టి అతడు సాఫ్ట్‌గా, నున్నటి గడ్డంతో ఏ రాక్‌స్టార్ తరహాలోనో కనిపిస్తాడని అందరూ ఊహిస్తుంటే అందుకు భిన్నమైన 'అర్జున్‌రెడ్డి' తరహా లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు విజయ్. లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్‌తో కనిపిస్తూ, తాగుతున్న సిగరెట్‌ను చేత్తో పట్టుకొని ఎదుటి వ్యక్తిపైకి విసిరేయబోతున్నట్లుగా ఆ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నాడు విజయ్. అతడి ముఖమంతా దెబ్బలు తగిలినట్లు నెత్తుటి గాయాలున్నాయి. కోపంతో అరుస్తున్నట్లు తెరిచిన నోట్లోంచి సిగరెట్ పొగ వస్తోంది. మొత్తానికి అది ఒక ఉద్వేగభరితమైన సన్నివేశానికి సంబంధించినదిగా అర్థమవుతోంది.
ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు - రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథిరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీతే - నటిస్తున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఒక సెన్సిబుల్ కథాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, టైటిల్ జస్టిఫికేషన్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని మూవీ యూనిట్ చెబుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎ. వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.