English | Telugu

తెలంగాణ పోరడుగా చైతు!!

on Aug 17, 2019

 

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా  అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. తన ప్రతి సినిమా లో ఎదో ఒక క్యారక్టర్  తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది.  ఇక `ఫిదా`  సినిమాతో సాయి పల్లవి క్యారెక్టర్ తెలంగాణ అమ్మాయి గా డిజైన్ చేసాడు. ఆ పాత్రలో సాయి పల్లవి నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇక తాజాగా నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం  తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా నటిస్తున్నాడు.  ఇందులో చైతు తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడట. ఇప్పటికే యాస కు సంబంధిచిన  ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


Cinema Galleries



Latest News


Video-Gossips