ENGLISH | TELUGU  

చిట్టిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు

on Mar 26, 2019

 

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1985 మార్చి 27 న జన్మించిన రామ్ చరణ్.. 2007 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. డాన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్.. యాక్టింగ్, లుక్స్ పరంగా మాత్రం మొదటి సినిమాకి కాస్త విమర్శలు ఎదుర్కున్నాడు. అయితే వాటన్నింటికీ తన రెండో సినిమాతోనే సమాధానం చెప్పాడు. 2009 లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' తో తనలో కూడా మంచి నటుడు ఉన్నాడని రుజువు చేసుకున్నాడు రామ్ చరణ్. అంతే కాదు ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి టాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

'మగధీర' లాంటి బిగ్ హిట్ తరువాత.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'ఆరెంజ్' అంటూ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తాపడి, నిర్మాతలకు నష్టం తెచ్చినప్పటికీ.. ఎందరో యూత్ హార్ట్ కి కనెక్ట్ అయింది ఈ సినిమా. టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో 'ఆరెంజ్' ఒకటని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ', వీవీ వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' సినిమాలు చేశాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలతో కూడా కలెక్షన్లు కొల్ల కొట్టాడని ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తరువాత బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'జంజీర్' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి విమర్శలు ఎదుర్కున్నాడు. ఇదే సినిమా తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలై రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.

ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'ఎవడు' తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే అనంతరం.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే'.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'బ్రూస్ లీ' సినిమాలు మాత్రం ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయాయి. ఇక 2016 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ధృవ' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నటుడిగా ఓ మెట్టు ఎదిగాడు. ఓ వైపు నటుడిగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి.. తన తండ్రి చిరంజీవి 150 వ సినిమాను నిర్మించి నిర్మాతగా కూడా విజయం అందుకున్నాడు.

ఇక రామ్ చరణ్ కెరియర్ లో 2018 సంవత్సరం ప్రత్యేకం. ఎందుకంటే 2018 లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్.. వినికిడి లోపమున్న 'చిట్టిబాబు' అనే పాత్రలో నటించి మెప్పించాడు. రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడున్నాడా? అని విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, టాలీవుడ్ ఆల్ టైం గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే 2019 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'వినయ విధేయ రామ' మాత్రం రామ్ చరణ్ కెరియర్ లో మరో భారీ ప్లాప్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి 'RRR' అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2020 లో ప్రేక్షకులను పలకరించనున్న ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. అయితే  'జంజీర్' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చేదు ఫలితాన్ని అందుకున్న రామ్ చరణ్.. 'RRR' తో బాలీవుడ్ లో అదిరిపోయే హిట్ కొట్టాలని ఆశిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.