తేజ్ గ్లాస్ మేట్ సునీల్!!
on Mar 25, 2019
సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో `చిత్రలహరి` సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఒక పాటై విడుదలైంది. ఇక రెండో పాట ఆదివారం విడుదలై వైరల్ అవుతోంది. `స్కూల్ వెళ్లే వరకే రా క్లాస్ మేట్స్, రెండ్ కట్టే వరకే రా రూమ్ మేట్స్, కానీ రియల్ రిలేషన్ షిప్ గ్లాస్ మేట్స్ ` అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, పెంచల్ దాసు పాడారు. సునీల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. గ్లాప్ మేట్ పాటలో తేజ్ తో పాటు గ్లాసులు కొడుతూ ఛీర్స్ కొడుతున్నాడు.
చంద్రబోస్ ఈ పాటలో లిరక్స్ చాలా ట్రెండీగా ప్రజంట్ ట్రెండ్ కనెక్టయ్యేలా చాలా క్యాజువల్ గా రాసాడు. ప్రస్తుతం ఈ పాటను యూత్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఉగాది కానుకగా మరో సాంగ్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తోంది.