వెంకీ మామా-మాస్ రాజా మల్టీ స్టారర్!!
on Mar 19, 2019
మల్టీ స్టారర్ మూవీస్ లో నటించేందుకు వెంకటేష్ ఆసక్తి చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల వెంకీ, వరుణ్ తేజ్ కలయికలో మల్టీస్టారర్ గా వచ్చిన `ఎఫ్ 2` చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ ఇన్ స్పిరేషన్ తో మరిన్ని సినిమాలు చేయడానికి వెంకీ ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్రజంట్ నాగచైతన్య , వెంకటేష్ కలిసి `వెంకీ మామ` లో నటిస్తున్నారు. అయితే వెంకటేష్ మరో క్రేజీ మల్టీస్టార్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిడని సమాచారం అందుతోంది. అవును మాస్ మహారాజ్ రవితేజ తో కలిసి వెంకటేష్ ఒక మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పాడట. వెంకీ కామెడీ టైమింగ్, మాస్ రాజా ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కలిస్తే....అంతే గా అంతేగా అనాల్సిందే ప్రేక్షకులు అంటున్నారు సినీ పండితులు. అయితే ఈ చిత్రాన్ని వీరుపోట్ల దర్శకత్వంలో అనిలీ సుంకర నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు ప్రారంభం అయినట్లు ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఇద్దరి చేసే హంగామా చూడటానికి వెండి తెర సరిపోదని చెప్పాల్సిందే.