సోషల్ మీడియాలో హాట్ హాట్
on Mar 19, 2019
అసలు రిలీజ్ కష్టమే అనుకున్న `టాక్సీవాలా` చిత్రం విడుదలై సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ నటించింది. తొలి సినిమానే హిట్టవ్వడంతో వరుస ఆఫర్స్ ఆమెను వరించుతాయనుకున్నారు. కానీ ఆమెకు ఆ సినిమా సక్సెస్ పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పటికే ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రియాంక జవాల్కర్ కి మాత్రం ఒక్క సినిమా అవకాశం వచ్చింది లేదు. అయితే ఇటీవల తమిళ, కన్నడ భాషల్లో సినిమా అవకాశాలు వచ్చాయట. దీంతో ఇప్పుడికి తనను తను ఎక్స్ ఫోజ్ చేసుకోవడానికి డోస్ పెంచి హాట్ హాట్ స్టిల్స్ తీయించుకోని మీడియాకు వదిలింది. ప్రజంట్ ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక తెలుగులో కూడా ఈ ఫొటోలతో ఆఫర్స్ రావడం ఖాయం అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. టాక్సీవాలో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజా స్టిల్స్ లో సన్నగా నాజూకగా తయారై కుర్రాళ్లకి వెర్రెక్కిస్తోంది. ఇకనైన ప్రియాంకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటుంది.