`ఆర్ ఆర్ ఆర్ ` ఫస్ట్ లుక్ ....ఫస్ట్ ఎవరిది!!
on Feb 15, 2019
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో మహా మల్టీస్టారర్ గా `ఆర్ ఆర్ ఆర్` చిత్రం వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రానుందట. కానీ ఫస్ట్ ఎవరి లుక్ వస్తుందన్నది ఇప్పుడి అందిరిలో మెదిలే సందేహం. `బాహుబలి` సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ లుక్స్ ను విడుదల చేసే విషయంలో డైరెక్టర్ రాజమౌళి ఫాలో అయిన స్ట్రాటజీని ఎవ్వరూ మర్చిపోలేరు. మెయిన్ లీడ్స్ పుట్టినరోజు కానుకగా విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ లుక్స్ కోసం వర్క్ వుట్ చేసింది రాజమౌళి తనయుడు కార్తీకేయ. ఇప్పుడు ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`కి సంబంధించి ఫస్ట్ లుక్స్ ని డిజైన్ చేసే బాధ్యతను కూడా కార్తీకేయ తీసుకున్నాడట. కాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల విషయంలో ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే రాంచరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.కేవలం ఓ స్టిల్ రిలీజ్ చేస్తారా, లేక బాహుబలి టైప్ లో వీడియో విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. సో `ఆర్ఆర్ఆర్` సినిమాకి సంబంధించి ఫస్ట్ విడుదల కాబోయేది రాంచరణ్ లుక్ అని ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు సినీ పండితులు.