విజయ్‌తో అఖిల్ దర్శకుడి సినిమా!!
on Jan 22, 2019
వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. గత ఏడాది `మహానటి`. గీత గోవిందం, టాక్సీవాలా, చిత్రాలతో ఘనవిజయాలను తన ఖాతాలో జమచేసుకున్న ఈ యూత్ ఐకాస్. ప్రస్తుతం కొత్త డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్ `లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రష్మీక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే... ఇదే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా కూడా చేయడానికి విజయ్ దేవరకొండ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతేకాదు.... ఈ చిత్రానికి దర్శకుడు కూడా కన్ ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వరుణ్ తేజ్ హీరోగా `తొలిప్రేమ` వంటి ఆహ్లాదభరితమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ అట్లూరి. ఇప్పటికే వెంకీతో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం... వెంకీ అట్లూరి చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా ఉంటోందని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ పై క్లారిటీ వస్తుంది. కాగా.. అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి రూపొందించిన తాజా చిత్రం `Mr. మజ్ను` ఈ నెల 25న విడుదల కానుంది.
Also Read