చిరు.. నయన్.. వన్స్‌మోర్!?
on Dec 8, 2018
మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. వీళ్లిద్దరి కాంబినేషన్లో తొలి చిత్రమిది. దీని తరవాత మరోసారి వీళ్లిద్దరూ జంటగా నటించనున్నారని ఫిలింనగర్ టాక్. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అందులోనూ కథానాయికగా నయనతారను ఎంపిక చేశారట. నయనతార కంటే ముందు కథానాయికగా తమన్నా పేరును పరిశీలనలోకి వచ్చిందట. నయనతార, తమన్నా... 'సైరా నరసింహారెడ్డి'లో ఇద్దరూ చిరంజీవితో నటిస్తున్నారు. చివరకు, నయనతారకు చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఓటేశారట. ఈతరం హీరోయిన్లలో చిరంజీవితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం నయనతారకు మాత్రమే దక్కింది. ఇటు తెలుగులో అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తున్న నయనతార... తమిళంలో లేడీ ఓరిటెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలను, కొత్త కాన్సెప్టులతో రూపొందుతున్న సినిమాలను బాలన్స్ చేస్తున్నారు.