కీరవాణి కొడుకుని రంగంలోకి దించాడుగా!!
on Nov 21, 2018
తెలుగు సినిమా సంగీతంలో కీరవాణినికి చెప్పుకోదగిన స్థానం ఉంది. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తె చ్చుకున్నారు. ఆయన కొడుకుని సింగర్ గా పరిచయం చేస్తూ బాహుబలి లో దండాలయ్య పాట పాడించాడు. ఈ పాటను అద్భుతంగా ఆలపించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ సంగీత దర్శకుడుగా `ఆకాశవాణి చిత్రంతో పరిచయం అవుతున్నాడు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన "షోయింగ్ బిజినెస్" అనే పేరు తో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశవాణి`. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది.