రామ్చరణ్... ఎన్టీఆర్... ఓ ఫైట్!
on Nov 21, 2018
రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తలపెట్టిన యజ్ఞం మొదలైంది. అదేనండీ... 'ఆర్ఆర్ఆర్' షూటింగు ఈ రోజు ప్రారంభమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సెట్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి రెండు వారాల పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ తీయనున్నారు. తరవాత కొన్ని రోజులు షూటింగుకు విశ్రాంతి ఇస్తారు. మళ్ళీ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలయ్యేలోపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ రామ్ చరణ్ పూర్తి చేయనున్నారు. రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ కథానాయకుడిగా, ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. 19వ దశాబ్దపు నేపథ్యంలో కథ జరుగుతుంది. అందుకోసం అప్పటి వాతావరణాన్ని తలపించేలా సెట్స్ వేశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. షూటింగ్ మొదలైనా ఇందులో కథానాయికలుగా ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. కీర్తీ సురేష్, కియారా అద్వానీ, రష్మిక, రకుల్ పేర్లు ప్రచారంలో వున్నాయి. ఓ విదేశీ కథానాయిక కూడా వుంటారట.