చిన్మయికి తమిళ ఇండస్ట్రీ షాక్!!!
on Nov 20, 2018
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. ఇటీవల కాలంలో మీటూ ఉద్యమంతో పాటు సుచీలీక్స్ వ్యవహారంతో బాగానే ఫేమస్ అయింది చిన్మయి. సింగర్ గా కూడా ప్రముఖ సంగీత దర్శకులతో పని చేసిన ఈమె పాటలు ఎన్నో శ్రోతలను ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనేంటో నిరూపించుకుంది. ముఖ్యంగా సమంత కు చిన్మయి వాయిస్ చాలా ప్లసయింది. అయితే ఇప్పుడు చిన్మయికి తమిళ ఇండస్ట్రీ షాక్ ఇచ్చిందట. ఒకసారి వివరాల్లోకి వెళితే...ఈమెను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయం పై ఇప్పుడు తన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసింద చిన్మయి. తనను డబ్బింగ్ యూనియన్ ని తొలిగించారు. ఆమెను తొలగించడానికి వాళ్లు చెప్పిన కారణం కూడా రెండేళ్లుగా సభ్యత్వ ఫీజ్ కట్టలేదని ...కనీసం నాకు నోటీస్ కూడా ఇవ్వలేదని చెబుతోంది చిన్మయి. తమిళ చిత్ర పరిశ్రమ నిబంధనల ప్రకారం తమకు డబ్బింగ్ యూనియన్ లో సభ్యత్వం లేకపోతే వాళ్లు తమ సినిమాకు డబ్బింగ్ చెప్పనివ్వరు ...దాంతో ఇప్పుడు తను ఖాలీ అయిపోయానని ట్వీట్ చేసింది చిన్మయి. చిన్మయి పై తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం తమిళ హీరోయిన్లతో పాటు మరికొందరు కూడా చిన్మయికి బాసటగా నిలుస్తున్నారు. ఈ మధ్య తమిళ లెజెండరరీ లిరిసిస్ట్ వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ చిన్మయి ఆరోపణలు చేసింది. అందుకే తమిళ నాట చిన్మయి కి కష్టాలు మొదలయ్యాయంటున్నారు తమిళ సినీ వర్గాలు.