రామ్‌చరణ్‌తో చిందేసే ఐటమ్ పాపెవరో తెలుసా!!!
on Nov 15, 2018
బోయపాటి సినిమాల్లో కచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. అయితే ఆ పాటల్లో ఆషామాషీ ఐటమ్ పాపలు ఉంటే కుదరదంటాడు బోయపాటి. ఫేమ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ తోనే ఆ స్పెషల్ సాంగ్స్ చేయిస్తుంటాడు. తాజాగా రామ్ చరణ్ తో బోయపాటి `వినయ విధేయ రామ` చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ రెండు పాటల్లో ఒకటి ఐటమ్ సాంగ్ ఉందట. ఈ పాట కోసం రకుల్ ప్రీతి సింగ్ ని కానీ, రాశీకన్నా ని కానీ తీసుకోవాలనుకుంటున్నాడట బోయపాటి. ఇప్పటికే రామ్ చరణ్ తో రకుల్ ప్రీతి సింగ్ `బ్రూస్ లీ` సినిమాలో నటించింది. అలాగే బోయపాటి డైరక్ట్ చేసిన జయ జానకి రామ చిత్రంలో కూడా రకుల్ ప్రీతి సింగే హీరోయిన్ . ఈ ఇద్దరి కోసమైనా రకుల్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశాలున్నాన్నది ఫిలింనగర్ టాక్. ఒక వేళ రకుల్ ఓకే చెప్పకుంటే ఏ మాత్రం లేట్ చేయకుండా రాశీకన్నా ను ఫైనల్ చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. చూద్దాం ఇద్దరిలో ఎవరో ఆ ఐటమ్ పాప.