తెలుగు సినిమా `గమ్యం` మార్చిన చిత్రం!!
on Nov 9, 2018
విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని, లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకొని సినీ రంగంలోకి వచ్చాడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). తొలి సినిమా క్రిష్‌తో నే ఉత్తమ దర్శకుడుగా `గమ్యం` ఏర్పరుచుకున్నాడు క్రిష్ ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ డైరక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. 2008లో విడుదలైన ఈ చిత్రం అల్లరి నరేష్ లోని మరో కోణాన్ని చూపించింది. శర్వానంద్ కెరీర్ లో కూడా బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. హీరో తను ప్రేమించిన అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణంలో తన గమ్యం ఏంటో ...అసలు మనిషి జీవితం ఏంటో తెలుసుకుంటాడు హీరో. ఆ ప్రయాణంలో హీరోకి అల్లరి నరేష్ లాంటి ఒక క్యారక్టర్ కలవడం చివరిలో తను మరణించడం లాంటివి ప్రేక్షకుడిని కదిలిస్తాయి. గమ్యం సినిమా చేయడానికి మొడట క్రిష్ టాలీవుడ్లో ఎక్కని ఆఫీసు గుమ్మం లేదు. ఎంతో కథ బాగుందని చెప్పడమే కానీ ఏ ఒక్కరూ నిర్మించడానికి ముందుకు రాలేదు. చివరకు తన సొంత బేనర్లోనే మిత్రుడు సహకారంతో సినిమాను నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వేదం చిత్రం అందరి ఆమోందం అందుకుంది, `కృష్ణం వందే జగద్దురుమ్` తో `క్రిష్ సినిమా తీస్తే విజయవంతమ్ `అనే స్థాయికి ఎదిగాడు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు చిత్రం `కంచె`. ఈ చిత్రంతో తెలుగు సినిమాను కంచె దాటించి తెలుగు దర్శకుడి సత్తా చాటించాడు.
ఇక చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన `గౌతమి పుత్ర శాతకర్ణి` చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా తెరకకెకించి అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి డైరక్టర్ గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. హిందీలో డైరక్ట్ చేసిన `మణికర్ణిక` త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం విశ్వా విఖ్యాత నటుడు ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా రూపొందుతులన్న `ఎన్టీఆర్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కథానాయకుడు, ప్రజానాయకుడు అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. తను చేస్తే ప్రతి సినిమాలో వినోదంతో పాటు వికాసం అందించాడు దర్శకుడు క్రిష్. ఈ ఉత్తమ దర్శకుడు ఈ రోజు (నవంబర్ 10)న పుట్టిన రోజు జరుపుకుంటోన్న క్రిష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగువన్ డాట్ కామ్.