బర్త్‌డే స్పెషల్ అంటూ షాకిచ్చిన డైరెక్టర్
on Oct 23, 2018
ప్రభాస్ బర్త్‌డే కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. దానికి కారణం ప్రభాస్ బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇస్తాననడమే. అన్నట్టుగానే ఈరోజు ప్రభాస్ 39వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకే కాదు, ప్రేక్షకులకు కూడా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు చాప్టర్ 1 పేరిట సాహో సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో తెలిసిందే. దానికి తగ్గట్టే సాహో టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. అబుదాబిలో 30 రోజుల పాటు షూట్ చేసిన సన్నివేశాలను ఈ టీజర్లో చూపించారు. కారు ఛేజింగ్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. మేకింగ్ షాట్స్, కారు ఛేజింగ్, మ్యూజిక్ ఇలా ప్రతిదీ ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్తుంది. ఇక చివర్లో ప్రభాస్ స్టైల్‌గా నడుచుకుంటూ రావడం, బైక్‌పై స్టంట్స్ చేయడం హైలైట్ గా నిలిచాయి. ప్రభాస్ స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే షాట్ సాహో ప్రభాస్ అనేలా చేస్తుంది. మొత్తానికి ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.