శ్రీరెడ్డికి లారెన్స్ ప్రామిస్.. శ్రీకాకుళంకు విరాళం
on Oct 17, 2018
కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్లో సంచలం రేపిన శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న ఆమెకు.. ఇప్పుడు లారెన్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. లారెన్స్ సినిమాలో తను నటించబోతున్నట్టు శ్రీరెడ్డి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్‌ను శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ‘నా ఫ్రెండ్స్ కి గుడ్ న్యూస్. లారెన్స్ గారిని ఆయన ఇంట్లో కలిశా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు. వాళ్లు లారెన్స్‌తో చాలా సంతోషంగా ఉండటం గమనించా. నేను ఆడిషన్స్ ఇచ్చాను. లారెన్స్ తన తర్వాతి సినిమా కోసం నన్ను తీసుకున్నారు. ఖచ్చితంగా మంచి పాత్ర ఇస్తానని ప్రామిస్ చేశారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీన్ని శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తాను’ అని శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.