మెగా బాయ్స్ గడ్డం... కేరాఫ్ మైత్రీ!
on Oct 16, 2018
కొన్ని కొన్నిసార్లు కొన్ని విషయాలు భలే కుదురుతాయంతే! మెగా బాయ్స్ గడ్డం కథలు కూడా అంతే! ఇద్దరు మెగా హీరోలకు మైత్రీ మూవీ మేకర్స్‌లో గడ్డం కథలు కుదరడం విశేషమే! మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ‘రంగస్థలం’. అందులో రామ్‌చరణ్ మాసిన గడ్డంతో కనిపించారు. క్యారెక్టర్ కోసం గడ్డం బాగా పెంచారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మరో మెగా హీరో, ముగ్గురు మావయ్యల ముద్దుల మేనలుడు సాయిధరమ్ తేజ్ మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘చిత్రలహరి’ అనే సినిమా చేస్తున్నాడు. తేజ్ బర్త్‌డే సందర్భంగా సినిమా ఓపెనింగ్ జరిగింది. అందులో తేజ్‌ని గమనిస్తే గడ్డం బాగా పెంచాడు. సినిమాలో అదే లుక్‌లో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో ముందుగా సినిమా చేసిన రామ్‌చరణ్ గడ్డంతో కనిపించాడు. ఇప్పుడు సినిమా చేయబోతున్న సాయిధరమ్ తేజ్ గడ్డంతో కనిపిస్తాడు. ఇంతకు మునుపు సినిమాల్లో వీళ్ళిద్దరూ ఇంతింత గడ్డాలు పెంచుకుని కనిపించిన సందర్భాలు లేవు. మెత్రీ మూవీ మేకర్స్‌లో మాత్రమే కుదిరాయి. నెక్ట్స్ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఎవరన్నా మెగా హీరో సినిమా చేస్తే... గడ్డం కథ కుదురుతుంతో? క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించే కథ కుదురుతుందో?
Also Read