సింగర్‌గా యంగ్ హీరో
on Sep 26, 2018
యంగ్ హీరో రామ్ సింగర్ గా మారాడు. ఏ సినిమా చేస్తే ఆ సినిమా హీరో తో సాంగ్ పాడిస్తుంటాడు మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీప్రసాద్ . ఈ సారి హీరో రామ్ వంతు అయ్యింది. ప్రెసెంట్ రామ్ ` హలో గురు ప్రేమకోసమే`చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం లో ఇటీవల ఒక సాంగ్ విడుదలైంది. అయితే ఈ చిత్రం లో ఒక మంచి ఎనర్జిటిక్ సాంగ్ రామ్ తో పాడించాడట దేవి . ఇప్పటికే ఈ సాంగ్ రికార్డింగ్ కంప్లీట్ అయిందట . అతి త్వరలో ఈ సాంగ్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఫ్రెష్ లవ్ స్టోరీ తో మంచి ఎంటర్టైనర్ గా ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ త్రినాథ్ నక్కిన.
రామ్ కామెడీ టైమింగ్ దగ్గర నుంచి లుక్ వరకు ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తున్నాడట. సినిమా చూపిస్తా మావ , నేను లోకల్ సినిమాల కు పనిచేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేస్తుంది. రామ్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నది. ప్రణీత సుభాష్ సెకండ్ లీడ్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.