బ్రహ్మోత్సవం దర్శకుడితో నాని..!!
on Sep 20, 2018
శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే యువత మనస్సు గెలుచుకున్నారు.. తరువాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మల్టీస్టారర్ ట్రెండ్ ను టాలీవుడ్ కి తిరిగి తీసుకొచ్చారు.. తరువాత 'ముకుంద'తో మెగా హీరో వరుణ్ తేజ్ ను వెండితెరకు పరిచయం చేసారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. తరువాతే శ్రీకాంత్ అడ్డాల కథ అడ్డం తిరిగింది.. మహేష్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.. దీంతో శ్రీకాంత్ అడ్డాల రేస్ లో బాగా వెనుకబడిపోయారు.. అవకాశాలు దూరమయ్యాయి.. అయితే శ్రీకాంత్ అడ్డాల గోడకి కొట్టిన బంతిలా మళ్ళీ బౌన్స్ అవ్వడానికి సిద్ధమయ్యారు.. యంగ్ హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలి అనుకుంటున్నారు.. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల, శర్వానంద్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఈ సినిమా పూర్తైన వెంటనే నానితో కూడా ఓ సినిమా ఉంటుందని సమాచారం.. ప్రస్తుతం నాని నటించిన ‘దేవదాస్’ సినిమా విడుదలకు సిద్ధమైంది.. ఈ సినిమాతో పాటు నాని ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా అనంతరం నాని, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది.. చూద్దాం మరి శర్వానంద్, నాని సినిమాలతో శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ట్రాక్ లోకి వస్తారేమో.