వ్యక్తిత్వంలో ఉన్నత శిఖరం అక్కినేని
on Sep 20, 2018
అక్కినేని నాగేశ్వరరావు అంటే అకుంఠిత దీక్ష, కృషి పట్టుదల, క్రమశిక్షణ. ఆయన నటుడు కావాలనుకున్నాడు తప్ప నటుడుగా పుట్టలేదు. 85 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో బహుదూరపు బాటసారి అక్కినేని. నటనలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న అతికొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. భారతదేశ సినీ చరిత్రలో అక్కినేని ఒక చరిత్ర , ఒక శకం. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ను ఒకసారి స్మరించుకుందాం...
అక్కినేని 1923 , సెప్టెంబర్ 20న జన్మించారు. పుట్టి పెరిగింది సంపన్న కుటుంబంలో కాదు, హయ్యర్ స్టడీస్ ఏమీ చదువుకోలేదు. సినిమా కష్టాలన్నీ పడ్డారు. అలాంటి ఓ పేద రైతు బిడ్డ తెలుగు సినిమా చరిత్రలో మూల స్థంభంగా ఎదగాడానికి ఎంతో కృషి చేశారు. చిన్ననాటి నుంచి స్వయం కృషితో ఎదిగారు. దేవుళ్లను నమ్మడు, నమ్మేవాళ్లకు అడ్డు చెప్పడు. గెలుపైనా, ఓటమైనా పూర్తి బాధ్యత తనే తీసుకునేవారు. వ్యక్తిత్వంలో ఆయన ఉన్నత శిఖరం. సాహసాలు చేయడం అక్కినేనికి చాలా ఇష్టం. నువ్వు ఇది చేయలేవు అంటే అది చేసే వరకు నిద్రపోయేవారు కాదు.
అక్కినేనితో దేవదాసు, విప్రనారాయణ చిత్రాలు తీస్తే నిండా మునిగిపోతారంటూ ఎంతో మంది దర్శక నిర్మాతలను భయపెట్టిన వాళ్లున్నారు. అక్కినేని సాహన శీలి. తనదైన స్టైల్ లో అన్నింటీని అధిగమించాడు. ఈ బక్కపల్చటి వాడు సినిమాల్లో పనికొస్తాడా అన్నారు? కానీ వరుస విజయాలతో నోళ్లు మూయించాడు. జానపద చిత్రాలతో మెప్పించాడు. కీలుగుర్రం, బాలరాజు లాంటి సినిమాలతో సమాధానం చెప్పాడు. సాంఘిక సినిమాలకు పెద్ద దిక్కుగా చిలిచాడు. ఈ పర్సనాలిటీతో పౌరాణిక చిత్రాలు చేస్తే జనాలు చూస్తారా అన్నారు. ఎన్టీఆర్ కంటే ముందే రాముడు,విష్ణుమూర్తి పాత్రల్లో మెప్పించారు. నాస్తికుడు, భక్తుడి పాత్ర ల్లో చేస్తారని విమర్శించిన వాళ్లతోనే భక్తుడి పాత్రలకు అక్కినేని తప్ప మరొకరు లేరని నిరూపించారు.
అక్కినేని విమర్శలు ఎదురైతే సమాధానం ఇచ్చారు. ఆయన కు ఎదురైనా ప్రతి సవాల్‌ను స్వీకరించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రంపచాన్ని సృష్టించుకున్నారు. తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఏన్నార్ కు ఏన్నారే సాటి. తెలుగు తెరకు స్టెప్పులు నేర్పిచిన కథానాయుకుడు అక్కినేని . బ్రేక్ డాన్ప్ లు, షేక్ డాన్స్ లు రావడానికి కారణం అక్కినేని. హీరో లనేవాడు స్టెప్పులేయాలని చూపించిన స్టైలిష్ హీరో ఏన్నార్.
85 ఏళ్లు సినీ పరిశ్రమ గమనంలో ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు అక్కినేని. 75 ఏళ్ల పాటు సినీ కళామ తల్లి సేవలోనే తరించారు. మూకీ చిత్రాలప్పుడే ఏయన్నార్ సినీప్రయాణం మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమ తొలితరం సూపర్ స్టార్ అక్కినేని తెలుగు సినీ పరిశ్రమ దాటిన ప్రతీ మలుపు దగ్గర నుంచి చూసిన వ్యక్తి అక్కినేని. ఇలా సినిమాలో ఇన్ని కోణాల్ని ఇంత అభివృద్దిని చూసిన వ్యక్తి ప్రపంచంలో అక్కినేని తప్ప మరో నటుడు లేరు.
తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పమని ఎవరైనా అడిగితే. అక్కినేని చరిత్ర చెబితే చాలు.ఈ 80ఏళ్ల తెలుగు సినీ గమనంలో అక్కినేని పాత్ర ఎంతో కీలకమైంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధాన పాత్రధారి అక్కినేని. ఎంతో కష్టపడి,ఎన్నో ఆటంకాలకొడ్డి అన్నపూర్ణ స్టూడియోను హైదరాబాద్ లో నిర్మించారు . ఇండస్ట్రీ హైదరాబాద్ లో స్థిరపడానికి కారకుడు అక్కినేని. ఆయన ఎప్పుడు కోపంగా కనిపించరు. తన అసహనాన్ని మరొకరిపై ప్రదర్శించరు. అసలు ఆయనకు కోపమే రాదు. అక్కినేని రూపం ప్రశాంతతకు చిరునామా. సంతోషానికి నిలువెత్తు రూపం అక్కినేని. జీవితాన్నంతా సంపూర్ణంగా అనుభవించిన నిండైన మనిషి అక్కినేని. ఎప్పుడూ మోముపై చెరగని చిరునవ్వు. ఇదే అక్కినేని ఆరోగ్యం రహస్యం.అందరికీ చెప్పిన జీవిత సూత్రం. మనిషికి సంతోషానికి మించిన మందు లేదని నిరూపించిన మహామనిషి.
సవాల్ ను స్వీకరించడం అంటే అక్కినేనికి మహా ఇష్టం. అందుకే నీవిక నటించలేవంటూ 40 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పినా. ఆ సవాల్ ను స్వీకరించి అధిగమించారు అక్కినేని. గుండె ఆపరేషన్ తర్వాత ఇన్నేళ్ళు బతికిన మనిషి ప్రంపంచంలో అక్కినేని మాత్రమే అంటే ఆయన నిబద్దత ఎలాంటిదో అర్థమవుతుంది. చావుకు ఏనాడూ భయపడలేదు ఏయన్నార్. కాన్సర్ సోకిందని ధైర్యంగా ప్రెస్ మీట్ చెప్పిన మహామనిషి ప్రపంచంలో అక్కినేని మాత్రమే. తనకేమీ కాదని అభిమానులు కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు. మీ అభిమాననే నా ఆయుష్షంటూ చావుకే సవాల్ విసిరిన ధైర్యశీలి అక్కినేని. చివరకు ఆయన జనవరి 22, 2014న కన్ను మూసారు.