బాలయ్యతో పటాస్ పేలుస్తాడట!!
on Sep 19, 2018
బాలయ్య బాబుకి స్టోరీ నచ్చిందంటే చాలు.. న్యూ డైరక్టర్ నా, అప్ కమింగ్ డైరక్టరా అన్నది అసలే చూడరు...అవకాశం ఇస్తారు. అలా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న ఓ యువ దర్శకుడికి సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆ యువ దర్శకుడు మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ తో `పటాస్` చేసి తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి. పటాస్ తో తన హైలీ టాలెంటెడ్ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్న అనిల్ రావిపూడడి ఆ తర్వాత `సుప్రీమ్`, రాజా ది గ్రేట్` చిత్రాలకు వహించాడు. ఈ రెండు చిత్రాలు కూడా సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌తో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం `ఎఫ్ -2` చిత్రం తర్వాత అనిల్ రావిపూడి చేయబోయేది బాలకృష్ణతో సినిమా అనే న్యూస్ సోషల్ నెట్ వర్క్స్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో బాలయ్య చేసిన `డిక్టేటర్ ` చిత్రానికి అనిల్ రావిపూడి వర్క్ చేశాడట...ఆ సమయంలో అనిల్ రావిపూడి మీద బాలయ్యకు పాజిటివ్ ఫీలింగ్ కలిగిందట. అప్పుడే మంచి కథ రెడీ చేసుకోమని చెప్పాడట. అప్పటి నుంచి అనిల్ స్టోరీ రెడీ చేసుకుంటున్నాడట. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ సినిమా తర్వాత బాలయ్య చేయబోయేది అనిల్ తోనే అన్నట్టు తెలుస్తోంది.