ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చిన సుమ..!!
on Aug 17, 2018
తెలుగులో యాంకర్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు సుమ.. తన యాక్టీవ్ నెస్ తో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తారు.. అలానే సుమ చేసే షోస్ లో మొదటగా గుర్తొచ్చే షో స్టార్ మహిళ.. సుమారు 12 సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికి విజయవంతంగా దూసుకుపోతుంది.. అయితే ఈ షో ప్రేక్షకులకు ఓ బాడ్ న్యూస్.. త్వరలో ఈ షో నిలిపివేయబోతున్నట్టు తెలుస్తోంది.. ఈ విషయాన్ని స్వయంగా సుమ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.
'మీ అందరికీ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను.. మీరు సుమ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ‘స్టార్ మహిళ’ కార్యక్రమం.. ఏకధాటిగా గత 12 ఏళ్లుగా ఈ షో విజయవంతంగా దూసుకెళుతోంది.. ఈ షోను ఆదరించినవారందరికీ శతకోటి వందనాలు.. కానీ, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదు.. అదే విధంగా ‘స్టార్ మహిళ’ ప్రయాణం కూడా ముగియనుంది.. మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ‘స్టార్ మహిళ’కు చిన్న ముగింపు పలుకుతున్నాం.. త్వరలో ఘనంగా ఫినాలే ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నాం.. మీరు నాకు, స్టార్ మహిళకు వీరాభిమానులైతే, నేనంటే మీకు అభిమానముంటే మీరు ఒక చిన్న పని చేయండి.. మీకు నేనంటే ఎంత ఇష్టమో, స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఎంత ఇష్టమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీయండి.. వాటిలో బెస్ట్ వీడియోలను ఎంపిక చేసి ఫినాలే ఎపిసోడ్లో ప్రసారం చేస్తాం.. చిన్నా,పెద్దా అన్న తేడాలేకుండా ప్రతిఒక్కరూ ‘స్టార్ మహిళ’ కార్యక్రమాన్ని ఆదరించారు.. వారందరి ప్రేమను, స్టార్ మహిళ ప్రోగ్రామ్‌ను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను’ అని సుమ తెలిపారు.. ఇది నిజంగా ప్రేక్షకులకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.