బిగ్ బాస్ నుండి దీప్తి సునైనా ఔట్..!!
on Aug 17, 2018
బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.. ఎవరు బాగా ఆడుతున్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అంటూ అంచనాలు వేస్తున్నారు.. ఈ వారం ఎలిమినేషన్ కూడా క్లైమాక్స్ కి వచ్చింది.. ప్రస్తుతం నామినేషన్లో దీప్తి సునైనా, గీత మాధురి, నూతన నాయుడు, పూజ, రోల్ రైడా మరియు శ్యామల ఉన్నారు.. అయితే ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం ఎక్కువవుతుంది.. సునైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనడానికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. సునైనా బిగ్ బాస్ ఇంట్లో ఓ చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది తప్ప, స్వంతంగా గేమ్ ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవట్లేదు.. అలాగే రీసెంట్గా జరిగిన కాల్ సెంటర్ టాస్క్‌లో కౌశల్‌కి కాల్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటంతో సునైనా మీద ప్రేక్షకులకు నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.. దీంతో ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.