మహర్షి టైటిల్ వెనుక ఇంత కథ ఉందా..!!
on Aug 10, 2018
నిన్న మహేష్ బాబు జన్మదినం సందర్భంగా.. మహేష్ 25 వ సినిమా 'మహర్షి'కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.. వీటికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.. మరోవైపు మహర్షి టైటిల్ లోగో గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.. కరెక్ట్ గా గమనిస్తే టైటిల్ లో మొదటి అక్షరంలో తుపాకి, రెండో అక్షరంలో కత్తి, మూడో అక్షరంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తున్నాయి.. అలానే టైటిల్ లోగో పై భాగంలో విలేజ్, క్రింద భాగంలో సిటీ ఉన్నాయి.. టైటిల్ లోగోలోనే ఇంత కథ ఉంది అంటే ఇక సినిమాలో ఎంత కథ ఉండుంటది అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.. అదేవిధంగా మహర్షి టైటిల్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ పాత్ర పేరు రిషి అని తెలిసిందే.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పేరు 'మహా' అందుకే సినిమాకి మహర్షి అనే టైటిల్ పెట్టి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.