బిగ్ బాస్ హౌస్ లోకి ప్రదీప్ ఎంట్రీ
on Jul 19, 2018
మొదటిసారి ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్.ఇప్పుడు సీజన్-2 లో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో లోకి యాంకర్ ప్రదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నాడు.దీనికి సంబంధించిన ప్రొమో ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది స్టార్ మా.
ఆ వీడియోలో "మన షో ఎంత హిట్ అయ్యిందో తెలుసా ప్రదీప్ కూడా వచ్చేశాడు" అంటూ తేజస్వి గ్రాండ్ వెల్ కమ్ చెబుతుంది. ఎడమకాలు పెట్టి లోపలికి రమ్మంటే ఎగురుకుంటూ లోపలికి వస్తాడు ప్రదీప్.గురువారం నాటి షోలో ఆయన ఎంట్రీయే ప్రధాన ఆకర్షణ కానుంది.ముఖ్యంగా ప్రదీప్లో ఉన్న మంచి లక్షణం ఎవరినీ నొప్పించకుండా అందర్నీతన మాటల ద్వారా కడుపుబ్బ నవ్వించేస్తాడు.ఫుల్ జోష్ ఉన్న యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఊహించని పరిణామమే.