శ్రీరెడ్డి మీద కేసు వేస్తున్న ఖుష్బూ దంపతులు
on Jul 18, 2018
ఫేస్బుక్కే వేదికగా ఎవరి మీద పడితే వాళ్ల మీద, ఎడాపెడా ఆరోపణలు చూపిస్తున్న శ్రీరెడ్డి వార్తలు కొత్తవేం కాదు. శ్రీరెడ్డి ఇంకా ఎక్కడ చెలరేగిపోతుందో అని చాలామంది, తమ పేర్లు చెప్పినా కూడా కుక్కన పేనుల్లా ఉంటున్నారు. నానిలాంటి కొంతమంది మాత్రమే శ్రీరెడ్డి మీ చర్యలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు తాజాగా శ్రీరెడ్డి మీద మరో నటుడు లీగల్ చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన ఎవరో కాదు! తమిళనాట దర్శకుడు, నటుడిగా మంచి పేరున్న సుందర్ సి. మాజీ నటి కుష్బూ భర్తగా ఈయన తెలుగువారికి సుపరిచితుడే. కొన్నాళ్ల క్రితం తాను సుందర్ సి. ని కలుసుకున్నాననీ, అవకాశం ఇస్తానని చెప్పి ఆయన తన కోరికను తీర్చుకున్నాడనీ ఈమధ్యనే ఫేస్బుక్లో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఈ విషయాన్ని జనం లైట్‌గా తీసుకున్నా, క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా పేరున్న సుందర్ మాత్రం ఊరుకోలేదు. త్వరలోనే శ్రీరెడ్డి మీద న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా ఆ దంపతులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.