ముఖ్యమంత్రిగా విజయ్...!
on Jul 17, 2018
తమిళ్ లో గొప్ప కథానాయకుడిగా పేరు ఉన్న విజయ్ తన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ‘సర్కార్’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ‘తుపాకి’, ‘కత్తి’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ టాక్.చూడబోతే హీరోలంతా ముఖ్యమంత్రి పాత్రలపై మనసు పారేసుకున్నట్లు ఉన్నారు.ఇటీవల ‘భరత్ అనే నేను’లో మహేష్‌బాబు సీఎంగా కనిపించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. త్వరలో విజయ్ దేవరకొండ కూడా ‘నోటా’లో సీఎం పాత్రలో కనిపిస్తారని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం లో విజయ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నేత కళ కరుప్పయ్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.