ENGLISH | TELUGU  

చినబాబు మూవీ రివ్యూ

on Jul 13, 2018

నటీనటులు:
కార్తీ, సాయేషా, సత్యరాజ్, సూరి తదితరులు..        

సంగీతం: డి.ఇమ్మాన్                                   
కెమెరా:  వేల్ రాజ్                         
నిర్మాత: సూర్య-మిర్యాల రవీందర్ రెడ్డి                              
దర్శకత్వం: పాండిరాజ్                               
విడుదల తేదీ: 13/07/2018

కార్తీ కథానాయకుడిగా సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పాండిరాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "చినబాబు". కార్తీ సరసన "అఖిల్" ఫేమ్ సాయేషా కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. పూర్తిస్థాయిలో తమిళ నేటివిటీ & సెంటిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకొందో చూడండి.

కథ:

కృష్ణంరాజు అలియాస్ చినబాబు (కార్తీ) అయిదుగురు అక్కలు, నలుగురు బావలు (ఒక బావ మరణిస్తాడు), ఇద్దరు మరదళ్లు, ఒక బామ్మర్ది ఉన్న పెనుగొండ వారి కుటుంబంలో ఒక్కగానొక్క మగబిడ్డ. అందరికంటే చిన్నోడు కావడంతో అందరూ ముద్దుగా "చినబాబు" అని పిలుచుకొంటారు.

కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటున్న సమయంలో.. చినబాబు ఇద్దరు మరదళ్ళలో ఒకామెను కాకుండా పరాయి కుటుంబానికి చెందిన నీళ్ళ నీరద (సాయేషా)ను పెళ్లి చేసుకోవాలనుకోవడంతో సమస్యలు తలెత్తుతాయి. ఒక్కసారిగా అక్కలు, బావలు, మరదళ్లు చినబాబు మీద విరుచుకుపడడమే కాక అతడేదో పెద్ద తప్పు చేసినట్లుగా దోషిలా చూడడం మొదలుపెడతారు.
కలిసిమెలిసి ఉండాల్సిన కుటుంబం తన ప్రేమ కారణంగా విడిపోతుందన్నా బాధతో ఉన్న చినబాబును అప్పటికే అతడ్ని శత్రువులా చూస్తున్నవారు మరింత కృంగదీయడానికి ప్రయత్నిస్తారు.
అలాంటి సమయంలో చినబాబు కుటుంబ సభ్యులెవరూ విడిపోకుండా తన ప్రేమను ఎలా కాపాడుకొన్నాడు, శత్రువులను ఎలా ఎదిరించాడు? అనేది "చినబాబు" కథ.

పాజిటివ్స్:

నటీనటులందరూ  
సంగీతం
సినిమాటోగ్రఫీ
ఎమోషన్స్ & క్లీన్ కామెడీ
ప్రొడక్షన్ వేల్యూస్

నెగిటివ్స్:

తమిళ నేటివిటీ
ప్రీ క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఓవర్ డోస్  

ఎనాలసిస్:

ఈమధ్యకాలంలో ఒక స్టార్ హీరోతో సినిమా అంటేనే పెద్ద పనిలా తయారయ్యింది. అలాంటిది 20 మంది ఆర్టిస్టులు, అందరూ మంచి గుర్తింపు ఉన్నవారే. అందరికీ సినిమాలో సమానమైన రోల్ ఇవ్వడమే కాక వారి నుంచి మంచి అభినయాన్ని రాబట్టుకొని.. కేవలం సెంటిమెంట్స్ మాత్రమే కాక కామెడీ కూడా క్రియేట్ చేసి దర్శకుడు పాండిరాజ్ తన ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు. సినిమాలో ఫైట్స్ ఉన్నాయి కానీ రక్తం చిమ్మలేదు, కామెడీ ఉంది కానీ అసభ్యత లేదు, ఎమోషన్స్ ఉన్నాయి కానీ అతి లేదు. సగటు ప్రేక్షకుడ్ని ఆకట్టుకొనే కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొనే ఎమోషన్స్ ఉన్నాయి. ఒక సినిమాకి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి.
ముఖ్యంగా రైతులన్నా, వ్యవసాయమన్నా సిటీ జనాల్లో ఉన్న చులకనభావం పారద్రోలాడానికి, జనాలు వ్యవసాయంవైపు మొగ్గు చూపడానికి పాండిరాజ్ చేసిన ప్రయత్నం అభినందనీయం.

నటీనటులు:

కార్తీ మాత్రమే కాదు సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించారు. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత, స్క్రీన్ ప్రెజన్స్ ఉంది. అందరూ ఆకట్టుకొన్నారు, నవ్వించారు, కన్నీరు పెట్టించారు, అలరించారు. కార్తీ ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు. సెంటిమెంట్ సీన్స్ లో కార్తీ పలికించిన ఎమోషన్స్ ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేయడమే కాదు కన్నీళ్లు పెట్టిస్తాయి. సత్యరాజ్ పెద్దరికం, శత్రు విలనిజం, సాయేషా అభినయం, అర్థన భాను అమాయకత్వం.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు తమదైన శైలిలో న్యాయం చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకొని సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు.

సాంకేతిక విలువలు:

డి.ఇమ్మాన్ సంగీతం బాగుంది. ముఖ్యంగా మెలోడీస్ ఆకట్టుకొంటాయి. అలాగే వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, బంధాలను, ఆత్మీయతను, అనుబంధాలను అద్భుతంగా తెరపై చూపించింది. రూబెన్ ఎడిటింగ్ సినిమాకి మరో ప్రత్యేకగా నిలిచింది. ఇంతమంది ఆర్టిస్టులున్నప్పటికీ.. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో సినిమా సాగడానికి రూబెన్ పనితనం బాగా ప్లస్ అయ్యింది.

సినిమా ఎలా ఉందంటే!
ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రమే కాక వయోబేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది.  

తెలుగు ఒన్ ప్రోస్పెక్టివ్:

అనీ అంశాలు పుష్కలంగా ఉన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

రేటింగ్: 2.5/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.