బుల్లితెరపై యుద్దానికి సిద్ధమంటున్న ఎన్టీఆర్
on Jun 22, 2018
'బిగ్ బాస్' రియాలిటీ షోతో బుల్లితెరపై ఎన్టీఆర్ చేసిన సందడి అంతాఇంతా కాదు.. ఎన్టీఆర్ అల్లరికి, టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్ త్వరలో మళ్ళీ బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు.. అయితే మీరు ఊహించినట్టు హోస్ట్ గా కాదు, గెస్ట్ గా.. ఈటీవీలో ఢీ-10 డాన్స్ షో గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నాడు.. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తుంది.. అంటే త్వరలో ఎన్టీఆర్ బుల్లితెర మీద మళ్ళీ సందడి చేయబోతున్నాడన్నమాట.