‘సైరా’కి షాకిస్తున్న చిరంజీవి
on Jun 20, 2018
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మొదట్లోనే అనుకున్నారు. గత ఆరు నెలల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు 30 శాతం మాత్రమే కంప్లీట్ అయిందట. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను వరుసపెట్టి షూట్ చేస్తున్నారు. అత్యంత భారీ సెట్లో జరుగుతున్న ఈ యాక్షన్ సన్నివేశాల షూట్ ఒక్కోసారి ఆలస్యం అవ్వడంతో ఉదయం నాలుగు అయినా కూడా చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా చిత్ర యూనిట్‌తో పాటు కష్టపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట. 60 సంవత్సరాల వయసులో కూడా ఇంత కష్టపడే తత్వం వున్న చిరంజీవిని చూసి ‘సైరా’యూనిట్ షాక్‌కి గురవుతున్నట్లు సమాచారం.