మహేష్ బాబుని కలిసిన సీఎం
on Jun 18, 2018
'భరత్ అనే నేను' సినిమాలో సీఎంగా నటించి ఆకట్టుకున్న మహేష్ బాబుని, రియల్ సీఎం కలిసారు.. ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ డెహ్రాడూన్ వెళ్లారు.. అక్కడే రీల్ సీఎంని రియల్ సీఎం కలిసినట్టు తెలుస్తుంది.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, షూటింగ్ స్పాట్ కి వెళ్ళి మహేష్ ని కలిసి కాసేపు మాట్లాడారట.. దీంతో సీఎం భరత్ ని కలిసిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అంటూ మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.. ఇక కొందరైతే అసలు ఉత్తరాఖండ్ సీఎం మహేష్ బాబుని ఎందుకు కలిసారు? దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా? అంటూ చర్చలు మొదలుపెట్టారు.