పవన్ కళ్యాణ్ భార్యకి రెండో పెళ్లి
on Jun 16, 2018
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ అందరికి సుపరిచితమే.. బద్రి సినిమాలో పవన్ తో కలిసిన నటించిన రేణూ.. పవన్ ని పెళ్లి చేస్కోవడం, తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోవడం తెలిసిందే.. అయితే సరైన భాగస్వామి దొరికితే పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకుంటానని ఇదివరకే చెప్పిన రేణూ.. ఇప్పుడు రెండో పెళ్ళికి సిద్దపడినట్టు తెలుస్తుంది.. తాజాగా రేణూ తన ఇంస్టాగ్రామ్ లో చేతులు కలిపిన ఒక ఫోటోని, దానికి తోడుగా ఒక ప్రేమ కవితని పోస్ట్ చేసారు..
ఆ ఫోటోని, ప్రేమ కవితని చూస్తే రేణూకి తను కోరుకున్న భాగస్వామి దొరికినట్టు అర్ధమవుతుంది.. 'నేను వెతికిన ప్రేమ నీలో దొరికింది.. నీతో ఉంటే సంతోషంగా ఉంటాను.. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికి వదలకు'.. అనే మృదువైన మాటలతో మనసుని తాకేలా రాసిన ఈ కవితని చూస్తే రేణూకి భాగస్వామి దొరికాడని అర్థమై అభిమానులు చాలా పాజిటివ్ గా స్పందింస్తున్నారు.. కానీ రేణూ పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో తెలియాల్సి ఉంది.
Also Read