అమెరికా సెక్స్ రాకెట్ గురించి యాంకర్ లాస్య చెప్పిన నిజాలు
on Jun 16, 2018
అమెరికా సెక్స్ రాకెట్.. ప్రస్తుతం టాలీవుడ్ ని కుదిపేస్తున్న హాట్ టాపిక్.. ఈవెంట్స్ పేరుతో విదేశాలకి వెళ్తున్న హీరోయిన్లు, డబ్బుకోసం వ్యభిచారం చేస్తున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు.. కానీ ఇది ముమ్మాటికీ నిజమని టాలీవుడ్ లోని ప్రముఖులే ఒప్పుకుంటున్నారు.. పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన యాంకర్ లాస్య ఈ విషయంపై స్పందించారు.. హీరోయిన్లకు వ్యభిచారం చేయాలన్న ఆలోచన లేకపోయినా డాలర్లు ఆశ చూసి వారిని ముగ్గులోకి దింపుతారని, పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో హీరోయిన్లు కూడా వ్యభిచారంలోకి దిగుతున్నారని చెప్పారు.. అమెరికాలో సెటిలైన మేము ఇక్కడ ఖర్చులు భరించలేక పొదుపు చేస్తుంటాం.కానీ ఇండియా నుండి వచ్చిన హీరోయిన్లు నెలలు నెలలు గడిపేస్తుంటారు.. దానికి కారణం వాళ్ళు వ్యభిచారం చేయడమే.. ఈవెంట్ల కోసం ఇక్కడికొచ్చే హీరోయిన్లు, ఆర్టిస్టులు డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారని లాస్య నిజాలు బయటపెట్టారు.
కొందరు హీరోయిన్లు ఇక్కడ వ్యభిచారం చేసి లక్షలు సంపాదించి ఏదో గొప్పగా చెప్పుకుంటారంటూ మండిపడ్డారు.. అలానే లాస్య తనకి ఎదురైన దురదృష్ట సంఘటనల గురించి కూడా చెప్పుకొచ్చారు.. ఒకసారి ఈవెంట్ కి వెళ్తే నన్ను ఆ ఉద్దేశంతో అడిగారని, నేను అలాంటి వాటికి ఒప్పుకోవట్లేదనే నన్ను ఈవెంట్స్ కి పిలవడం మానేశారని చెప్పారు.. తను కూడా అప్పటి నుండి ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పిన లాస్య, మరో సంఘటన గురించి కూడా చెప్పారు.. అమెరికాలో సెటిలైన ఒక పెద్ద మనిషి ఒకసారి తనకి కాల్ చేసి ఆ ఉద్దేశంతో అడిగాడని, నేను ఒప్పుకోకపోవడంతో 'పెద్ద పెద్ద యాంకర్లే వస్తారు నువ్వెంత ఆఫ్ట్రాల్' అని అతను మాట్లాడాడు అని చెప్తూ లాస్య వాపోయారు.. లాస్య బయటపెట్టిన ఈ నిజాలతో అందరూ షాక్ అవుతున్నారు.. కళని నమ్ముకొని అభిమానుల్ని సంపాదించుకోవాల్సిన నటీమణులు, ఇలా ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించటం ఏంటంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.