అమెరికాలో తెలుగు హీరోయిన్ల సెక్స్ రాకెట్
on Jun 15, 2018
తెరమీద కనిపించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాల్సిన కొందరు హీరోయిన్లు, తెరవెనుక చీకటి భాగోతాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు.. ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ దొరికిపోయి.. వాళ్లకున్న పేరుని, అభిమానాన్ని పోగొట్టుకున్నారు.. తాజాగా అమెరికా సాక్షిగా కొందరు తెలుగు హీరోయిన్ల చీకటి భాగోతం బయట పడింది.. అవార్డు ఫంక్షన్లు, షూటింగుల పేరుతో విదేశాలు వెళ్తున్న కొందరు హీరోయిన్లు డబ్బు కోసం వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటున్నారు..
చికాగో పోలీసుల పుణ్యమా అని హీరోయిన్ల చీకటి భాగోతం బయటపడింది.. కృష్ణ మోదుగుముడి, చంద్ర మోదుగుముడి అనే దంపతులు అవార్డు ఫంక్షన్లు, ఈవెంట్లు చేస్తుంటారు.. కానీ తెర వెనుక హీరోయిన్ల శరీరంతో వ్యాపారం చేస్తున్నారు.. సీక్రెట్ గా సాగుతున్న ఈ సెక్స్ రాకెట్ ఎట్టకేలకు బయటపడింది.. కొందరు చిన్న ఆర్టిస్టుల పేర్లు బయటికొచ్చినప్పటికీ.. ఈ రాకెట్లో పెద్ద హీరోయిన్లు, టాప్ యాంకర్లు ఉన్నట్టు తెలుస్తుంది..
బాపు బొమ్మల్లా తెర మీద కనిపిస్తూ అభినయంతో ఆకట్టుకోవాల్సిన హీరోయిన్లు ఇలా మన దేశ సాంప్రదాయ కంచె దాటి, విదేశాల్లో తమ శరీరాన్ని సేల్ చేస్కోవడం ఏంటంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం 'అవార్డు ఫంక్టన్ల పేరుతో కొందరు హీరోయిన్లు విదేశాలుకెళ్ళి వ్యభిచారం చేయడం కామన్' అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.