కోర్టు కేసులో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు
on May 25, 2018
బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్కు, మొదటి భార్య అమృతా సింగ్కు పుట్టిన కూతురు సారా అలీ ఖాన్. సారా తమ చిత్రానికి పనిచేసేందుకు ఒప్పుకుని ఆ తర్వాత మొహం చాటేసిందంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. తీరా సారాని నమ్ముకుని తాము చిత్రాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆమె వేరే చిత్రంలో బిజీగా ఉన్నానని తప్పించుకుంటోందని ఆరోపించాడు. ఆమె వల్ల తనకు జరిగిన నష్టానికిగాను అయిదు కోట్ల రూపాయలను నష్టం కింద కట్టాలని కోర్టుని అభ్యర్థించారు. మొత్తానికి మొదటి సినిమాకే కోర్టు కేసుని ఎదుర్కొన్న హీరోయిన్గా సారా చరిత్రకెక్కింది.