మామ టైటిల్ తో అల్లుడు.. కలిసొస్తుందా...?
on May 23, 2018
మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చారు. ఇక ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ కూడా వెండితెరపైకి వస్తున్నాడు. కల్యాణ్ హీరోగా, మాళవిక నాయర్ కథానాయికగా రాకేశ్ శశి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. అయితే ఇప్పుడు ఈసినిమా టైటిల్ ఏం పెట్టారో తెలుసా..! తన మామ టైటిల్ నే అల్లుడు కల్యాణ్ సినిమాకు పెట్టారు. ఇంతకీ టైటిల్ ఏంటంటే.. "విజేత". ఈ సినిమా టైటిల్ 'విజేత' అని ఎనౌన్స్ చేస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. విజేత అని టైటిల్ పెట్టి దానికి ఇతరుల ముఖంలోని ఆనందానికి కారకుడివైతే నువ్ సక్సెస్ అయినట్టే అనే అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ పెట్టారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చాడు. మరి చిరంజీవి కెరీర్ లో ఘన విజయాన్ని సాధించిన 'విజేత' టైటిల్ అల్లుడు కల్యాణ్ కు పెట్టారు. ఇక ఈ టైటిల్ కల్యాణ్ కు ఎంత వరకూ కలిసొస్తుందో..విజేత చిరంజీవి ఘన విజయాన్ని అందించినట్టు కల్యాణ్ కు కూడా ఘనవిజయాన్ని సాధించిపెడుతుందో లేదో..? చూద్దాం...
Also Read