అమ్మమ్మ గారిల్లు ఈనెల 25న వస్తోంది
on May 22, 2018
నాగశౌర్య, బేబి షామిలి జంటగా నటిస్తున్న `అమ్మమ్మగారిల్లు` సినిమాకు సెన్సార్‌లో సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ `యు` సర్టిఫికెట్ లభించింది. ఈనెల 25న భారీ ఎత్తున సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేష్ , దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, `ఇప్పటికే యూ ట్యూబ్ లో రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు సినీ పెద్దలు కూడా టీజర్ చూసి ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. తాజాగా మా సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బృందం క్లీన్ `యు` సర్టిఫికెట్ జారీ చేసింది.
కుటుంబ సమేంతంగా చూడదగ్గ సినిమా అని సెన్సార్ టీమ్ మెచ్చుకున్నారు. ఈనెల 25న గ్రాండ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
Also Read