బాలయ్య అంటే అంత భయమెందుకో??
on Apr 18, 2018
టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకులందరితోనూ నటించింది కాజల్. ఒక్క నందమూరి బాలకృష్ణతో తప్ప. ఆ అవకాశం వస్తే.. ఎగిరి గంతేయాల్సింది పోయి, బాలయ్యతో సినిమా అంటే గజగజ వణికిపోతూ `నో` చెప్పేసింది కాజల్. నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథని సినిమాగా మలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ గా బాలయ్యే కనిపించనున్నాడు. జయలలిత పాత్ర కోసం కాజల్‌ని సంప్రదించారట. కానీ కాజల్ మాత్రం `అమ్మో.. నేను చేయలేను` అని చేతెలెత్తేసిందని టాక్. తేజకీ కాజల్‌కి మంచి అనుబంధం ఉంది. లక్ష్మీ కల్యాణంతో కాజల్‌కి బ్రేక్ ఇచ్చింది తేజనే. ఇటీవల `నేనే రాజు నేనే మంత్రి`లోనూ కాజల్‌ని కథానాయికగా ఎంచుకున్నారు. తేజ అడిగితే.. ఏ సినిమా అయినా ఒప్పుకునే కాజల్... ఆయన అడిగినా నో చెప్పడం ఆసక్తిగా మారింది. బాలయ్య అంటే కాజల్ ఎందుకంత భయపడుతోందో మరి?? మరోవైపు కొన్ని కీలకమైన పాత్రల్లో నటీనటుల ఎంపికపై బాలయ్య తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ఏ ఒక్కరి పేరునూ ప్రకటించలేదు. మరి జయలలిత పాత్రలో ఎవరు కనిపిస్తారో, ఏంటో?