రాజశేఖర్ రెడ్డి సినిమాలో చంద్రబాబుకి చోటు లేదు
on Mar 21, 2018
ప్రస్తుతం బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేయడానికి సిద్ధమవుతుండగా, సావిత్రి బయోపిక్ మహానటి విడుదలకు సిద్ధమవుతోంది. వై యస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం విదితమే. ఆనందో బ్రహ్మ తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ మహి వి రాఘవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా పూర్తి జీవిత చరిత్ర కాదట, కేవలం దివంగత నేత పాదయాత్ర సమయంలో జరిగిన సంఘటనల్ని ఆధారం చేసుకొని తీస్తున్నారట. యాత్ర అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు.
నయనతార రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ మరియు సూర్య జగన్ మోహన్ రెడ్డి పాత్రలు చేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే, వీటిలో వాస్తవం లేదు అని డైరెక్టర్ రాఘవ్ ఈ వార్తల్ని ఖండించారు. త్వరలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు ప్రకటిస్తానని అన్నారు. ఇదిలా ఉంటే, యాత్ర లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఉండదట. సినిమా ఫోకస్ మొత్తం, కేవలం రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ పైనే ఉంటదట. ఎవర్ని కించపరిచే విధంగా డైలాగ్ లు గట్రా ఉండవట. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి పాదయాత్ర ఎలా హెల్ప్ చేసింది అని మాత్రమే చూపిస్తారట.