ఘనంగా రష్మీ, సుధీర్ల పెళ్లి!
on Mar 19, 2018
జబర్దస్త్ జంట... రష్మీ.. సుధీర్లకు ఘనంగా పెళ్లి జరిగిపోయింది. అదీ.. జబర్ దస్త్ టీమ్ మధ్యే. నాగబాబు, రోజా ఈ పెళ్లికి పెద్దలు. జబర్దస్త్లో ఎంత గోల చేస్తారో, ఈ పెళ్లి వేడుకలోనూ ఈ జంట అంతే గోల చేశారు. అంతే కాదు.. ఇద్దరూ డ్యూయెట్లు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంత సడన్గా వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు జరిగిపోయింది, ఎలా జరిగిపోయింది అనుకుంటున్నారా? ఇదీ... ఓ టీవీ షోలో భాగమే. జబర్ దస్త్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచీ.. రష్మీ, సుధీర్లపై రకరకాల పుకార్లు. ఇద్దరూ లవ్లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల కామెంట్లు. సుధీర్ కూడా.. రష్మీపై ఇలాంటి ప్రాక్టికల్ జోక్సే వేస్తుంటాడు. దాంతో నిజంగానే వీళ్లిద్దరి మధ్యా ఏదో ఉందేమో అన్న అనుమానాలు రేకెత్తాయి. దానికి తగ్గట్టుగా... ఓ టీవీ ఛానల్ వీరిద్దరికీ ఉత్తుత్తి పెళ్లి చేసి ఆ అనుమానాలకు మరింత ప్రాణం పోసింది. ఏమాటకామాట చెప్పుకోవాలంటే పెళ్లి దుస్తుల్లో రష్మీ, సుధీర్ అదిరిపోయారు. నిజం పెళ్లిలా.. వాళ్లిచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే.. మనసులోనూ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తోంది. ఓ టీవీ షో యాంకర్లకు ఇలా.. సెట్లో ఉత్తుత్తి పెళ్లి చేయడం బహుశా... ఇదే తొలిసారేమో. ఇది ఉత్తుత్తి పెళ్లేనా.. లేదంటే పెళ్లికి రిహార్సల్స్ ఏమైనా చేసుకున్నారా? అంటూ నెటిజన్లు కౌంటర్లు కూడా వేసుకుంటున్నారు.
Also Read