సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న శ్రీయ..
on Mar 17, 2018
యాక్ట్రెస్ శ్రీయ శరన్ తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ని సీక్రెట్ గా ఈ నెల 12 న ముంబై లోని తన ఇంటిలో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్ళికి అంతకు ముంది రోజు జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. ఇక ఇండస్ట్రీ నుండి కేవలం మనోజ్ బాజ్పాయి మరియు షబానా అజ్మి మాత్రమే అటెండ్ అయ్యారట. శ్రీయ శరన్, ఆండ్రీ కొస్చీవ్ ల పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందట. పెళ్ళిలో శ్రీయ పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిందట. ఇంతకు మునుపు, శ్రీయ మూడు రోజుల పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ, శ్రీయ ఆ వార్తల్ని ఖండిస్తూ తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పింది. ఇంతలో, పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీయ శరన్, ఆండ్రీ కొస్చీవ్ చాలా రోజుల నుండి పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ, బయట ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరిలో ఎవరు కూడా తాము కలసి ఉన్న ఫోటోలు ఇంత వరకు షేర్ చేయలేదు అంటేనే అర్ధం చేసుకోవచ్చు, వాళ్ళు తమ రేలషన్శిప్ ని ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేశారో అని. మోహన్ బాబు, మంచు విష్ణుల గాయత్రి లో చివరగా కనిపించిన శ్రీయ ప్రస్తుతం నారా రోహిత్ సరసన వీర భోగ వసంత రాయలు అనే సినిమా చేస్తుంది. ఇక ఆండ్రీ కొస్చీవ్ విషయానికి వస్తే, రష్యా జాతీయుడయిన అతడు టెన్నిస్ ప్లేయర్ మరియు బిజినెస్ మాన్.
Also Read