టీజర్ రివ్యూ: మెహబూబా
on Feb 9, 2018
ఎలాగైనా కొడుకుని హీరోగా సెట్ చేయాలని కలలుగంటోన్న.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈసారి తనలోని అసలు సిసలు డైరెక్టర్ని మేల్కోలిపాడు. ఆకాశ్‌ని హీరోగా పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న సినిమా మెహబూబా. 1971 ఇండో-పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రోమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ఉంచుతూ.. బజ్ క్రియేట్ చేస్తోన్న పూరీ... ఇవాళ ఫస్ట్‌లుక్ టీజర్‌ను రిలీజ్ చేశాడు
"బోర్డర్ దగ్గర్లో ఉన్న ఆర్మీ క్యాంప్.. దానిపై జెట్ ఫైటర్స్ ఎటాక్.. ఫైరింగ్ మధ్యలో ఒక అమ్మాయిని సైనికుడు కాపాడుకుంటూ వచ్చే సీన్‌తో టీజర్ కట్ చేశారు. ఇందులోని ప్రతీ ఫ్రేమ్ విజువల్‌గా అదిరిపోయింది.. మళ్లీ పసలేని స్టోరీతో.. నాలుగు పంచ్ డైలాగ్స్‌తో ఈ మెహబూబాని కూడా జగన్ లాగించేసి ఉంటాడని అందరూ భావించిన వేళ.. ఇది తీసింది పూరీనేనా..? అనేట్లుగా మేజిక్ చేశాడు. సినిమాటోగ్రఫితో పాటు సందీప్ చౌతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.