అనుష్కకు కోహ్లీ ఇచ్చిన మ్యారేజ్ గిఫ్టేంటీ..?
on Dec 13, 2017
నాలుగేళ్ల ఉత్కంఠకు.. ఊహాగానాలకు తెరదించుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఇటలీలో వీరి పెళ్లి జరిగింది. వివాహాన్ని ఏ హాడావిడి లేకుండా చేసుకున్నప్పటికీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ఇవ్వనున్నారు. బంధువులు, స్నేహితుల కోసం 21 ఢిల్లీలోనూ.. క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం 26న ముంబైలోనూ విందు ఏర్పాట్లు చేసింది ఈ జంట.
సరే, ఈ సంగతి పక్కనబెడితే... ప్రేమలో ఉన్నప్పుడు ప్రేయసికి ఎన్ని బహుమతులిచ్చినా.. పెళ్లి రోజు ఇచ్చే కానుక అపురూపమైనది.. అది జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం. మరి అనుష్క శర్మకు విరాట్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు. అక్కడికే వస్తున్నాం.. వెడ్డింగ్ రోజు తన భార్య కోసం మంచి పాటను పాడిన కోహ్లీ ఆ సమయంలోనే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడట. ఇంతకీ ఏంటా గిఫ్ట్ అంటారా..? అరుదుగా లభించే వజ్రాలతో తయారు చేసిన డైమండ్ రింగ్. ఆస్ట్రేలియాకు చెందిన ఫేమస్ డిజైనర్ దీనిని డిజైన్ చేశారట. ఈ ఉంగరాన్ని చూసిన ప్రతీసారి ఏదో డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తుందట. ఇక దీని కాస్ట్ విషయానికి వస్తే.. అక్షరాల కోటి రూపాయలని బాలీవుడ్ టాక్. అన్నట్లు ఈ ఉంగరాన్ని వెతకడానికి విరాట్‌కు సుమారు మూడు నెలలు పట్టిందట.
Also Read